తెలుగు భాషపై ఏపీ సీఎం జగన్ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారని.. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి అంటూ కొనియాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారని ప్రశంసించారు. గిడుగువారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామని.. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇది ఇలా ఉండగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ ఆర్ధిక శాఖ పై సమీక్ష చేయనున్న సీఎం జగన్…ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు.
ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు. తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి, వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు, తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు.… pic.twitter.com/Ie0WoIsL0z
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2023