దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. దీపావళి అంటే కాంతి-వెలుగు అని పేర్కొన్నారు. చీకటి పై వెలుగు, చెడు పై మంచి… అజ్ఞానం పై జ్ఞానం… దుష్టశక్తుల పై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీక అంటూ వెల్లడించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని ఆకాంక్షిస్తున్నానన్నారు సీఎం జగన్. అటు దీపావళి పండుగను పురస్కరించుకొని సీఎం కేసీఆర్…తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించాలని కోరారు.