విజయవాడలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం విజయవాడకు పయనం కానున్నారు ఏపీ సీఎం జగన్. హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. అడిషనల్ జడ్జిలుగా హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అడిషనల్ జడ్జిలుగా హరినాథ్ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ ల ప్రమాణస్వీకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జరుగనుంది.
ఇక ఈ అడిషనల్ న్యాయమూర్తుల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొననున్నారు సీఎం జగన్. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు రాజ్ భవన్ కు చేరుకోనున్న సీఎం జగన్.. మొదటగా గవర్నర్ తో భేటి కానున్నారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు గవర్నర్ తో కలిసి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి వెళతారు.