నేడు సీఎం జగన్ విశాఖ పర్యటన.. వారి అకౌంట్లలో రూ.10 వేలు

-

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకి బయలుదేరనున్నారు.10.30 గంటలకు విశాఖ చేరుకోనున్నారు.11.05 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ కు చేరుకుని వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భాద్యతలు తీసుకున్న తర్వాత పేదలకు ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు..ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. నవరత్నల్లో భాగంగా వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌ ద్వారా అర్హులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.ఇందులో భాగంగా నేడు అర్హులైన సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్‌ డ్రైవర్‌ కమ్‌ ఓనర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ఈ ఆర్థిక సాయం అందించనున్నట్లు రవాణా శాఖ కమిషనర్‌ రాజబాబు తెలిపారు.

అలాగే వాహణాల ఇన్సూరెన్స్‌, ఫిట్‌నెస్‌, మరమ్మతుల నిమిత్తం నగదు సాయం అందిస్తున్నట్లు తెలిపారు..అర్హులైన వారికి వాహన మిత్ర పథకానికి అప్లై చేసుకోవచ్చునని తెలిపారు.నేడు విశాఖలో లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున రూ.261.51 కోట్ల ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్లలో మొత్తం రూ.1,025.96 కోట్ల వ్యయం చేసిందని…ఈ సారికూడా సాయం చేస్తున్నట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version