ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ గుంటూరు పర్యటన

-

నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిని పరామర్శించనున్నారు ఏపీ సీఎం జగన్. నిన్న మద్దాలి గిరి కి మాతృవియోగం కలిగింది. ఈ తరుణంలోనే నేడు గుంటూరులో సీఎం జగన్ పర్యటించనున్నారు.

ఇందులో భాగంగానే.. తాడేపల్లి నుండి హెలికాప్టర్లో గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఇక గుంటూరు జిల్లాలో ఈ తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కురిసింది భారీ వర్షం. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పర్యటనపై సందిగ్దం కొనసాగుతోంది. తడిచిన హెలిపాడ్ వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక ఇవాళ ఉదయం 10:30 గంటలకు సీఎం జగన్ గుంటూరు చేరుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version