కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది – వైవీ సుబ్బారెడ్డి

-

కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు వై.వి సుబ్బారెడ్డి. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని.. వరద నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు వైసిపి నేతలను అరెస్టు చేయిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయిస్తోందని దుయ్యబట్టారు.

వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టులు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు, మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టును ఆయన ఖండించారు. తమ పార్టీ నేతలను అన్యాయంగా కేసుల్లో ఇరికించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఇక వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కి, మాజీ మంత్రి బాలినేని మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ఇక చంద్రబాబు ఇంటిపైకి వరద నీరు రాకుండా బుడగమేరును మళ్ళించారని.. ఆ కారణం వల్లే విజయవాడ ప్రజలు వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version