టీటీడీ ఈవో శ్యామలరావుకు ఊహించని షాక్ తగిలింది. తిరుపతి లోని టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము దూరింది. దింతో రంగంలోకి రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడు దిగారు. పామును పట్టుకునేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడు వచ్చారు.

ఆ పామును పట్టుకుని గొనె సంచెలో వేస్తుండగా చేతిపై కాటు వేసింది పాము. దింతో రవీందర్ నాయుడుకు స్విమ్స్ హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోంది. టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో నాగుపాము దూరిన సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది ఇలా ఉండగా, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమలలో సందడి చేశారు. తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శన క్యూలైన్లు పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.