కడుపు క్యాన్సర్ కు సంబంధించిన ఈ లక్షణాలు కనిపిస్తే.. జాగ్రత్త వహించాల్సిందే..!

-

చాలా శాతం మంది ఆరోగ్యం విషయంలో ఎంతో ఆశ్రద్ధ చూపిస్తారు. కొన్ని లక్షణాలు కనబడినప్పుడు డాక్టర్ సూచనలను తీసుకోకుండా వ్యవహరిస్తారు. దాని వలన తీవ్రత ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా కడుపు క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలు కనబడినా, చాలా మంది అజాగ్రత్తగా ఉంటారు. దీంతో తీవ్రత మరింత పెరుగుతుంది. ప్రారంభ దశలో కడుపు క్యాన్సర్ లేక గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ను గుర్తిస్తే దాన్ని త్వరగా తగ్గించవచ్చు. సరైన చికిత్స తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రారంభ దశలో కడుపు క్యాన్సర్ లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి.

సాధారణంగా ఎదురయ్యే అజీర్ణం, గుండెల్లో మంట లక్షణాలు కూడా కడుపు క్యాన్సర్ కు సంబంధించిన మొదటి లక్షణాలు. కానీ అందరూ ఈ లక్షణాలను అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అజీర్ణం, కడుపులో మంటతో పాటు కడుపు ఉబ్బినట్లు లేక నిండుగా ఉన్నట్లు అనిపించినా ఇది క్యాన్సర్ కు సంకేతమని గమనించాలి. వికారం, వాంతులు వంటి లక్షణాలు కూడా కడుపు క్యాన్సర్ కు కనిపిస్తాయి. ఎప్పుడైనా ఎటువంటి కారణం లేకుండా ఈ లక్షణాలు కనిపిస్తే, కచ్చితంగా నివారణలు తీసుకోవాలి. ఆకలి తగ్గిపోవడం, తినాలనే కోరిక లేకపోవడం కూడా కడుపు క్యాన్సర్ కు సంబంధించిన లక్షణాలు.

కడుపు క్యాన్సర్ లేదా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రారంభ దశలో కారణం లేకుండా బరువు తగ్గడం వంటివి సహజం. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే, కచ్చితంగా వైద్యుని సలహాలను తీసుకోవాలి. క్యాన్సర్ తీవ్రత పెరిగిన తర్వాత, కడుపు నొప్పి అధికంగా ఉంటుంది. తీవ్రత పెరిగే కొద్దీ, లక్షణాలు కూడా మారుతాయి. వాంతులు అయ్యే సమయంలో రక్తం రావడం వంటి లక్షణాలను కూడా ఎదుర్కొనవచ్చు. కడుపు క్యాన్సర్ ఎప్పుడైతే కాలేయానికి వ్యాపిస్తుందో, కామెర్ల సమస్యలు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది. కడుపు క్యాన్సర్ వల్ల శరీరం బలహీనంగా మారుతుంది. శరీరం బలహీనంగా మారడం వలన, అలసట ఎక్కువ అవుతుంది. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుల సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభ దశలోనే క్యాన్సర్ ను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్య తీవ్రతను నివారించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news