ఇసుక పెనాల్టీ కింద 24 లక్షల రూపాయల ఆదాయం : కలెక్టర్ ప్రశాంతి

-

అక్టోబర్ 16 నుండి శాండ్ రీచ్ లు ప్రారంభించే అవకాశం లేదు. డీసిల్టేషన్ పాయింట్లలో ఇసుక తీసుకుంటున్నాము అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. పెండ్యాల, పందల పర్రు రీచ్ ల నుండి మూడు జిల్లాలకు సరఫరా చేస్తున్నాం. బోట్ మెన్ సొసైటీల ద్వారా ఇసుక వెలికి తీస్తున్నాం. సోమవారం నుండి 65 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచుతాం. శాండ్ రీచెస్ వద్ద 345 రూపాయలు టన్నుకు వసూలు చేస్తాం. స్టాక్ పాయింట్స్ నుండి టన్నుకు 257 కి సరఫరా చేస్తాం.

ఇక అన్ని రీచ్లు అందుబాటులోకి వస్తే రోజుకు 6.50 లక్షల టన్నులు ఇసుక అందుబాటులోకి వస్తుంది. ప్రతిరోజు 65 వేల టన్నుల ఇసుక అందుబాటులో ఉంటుంది. బల్క్ కన్జ్యూమర్స్ ఆర్డర్లు కూడా తూర్పుగోదావరి జిల్లాకే 144 వచ్చాయి. పట్టా లాండ్స్ లో కూడా ఇసుక తీసుకోవడానికి జీవో విడుదలైంది. రోజుకు జిల్లాలో ఆరేడు వేల టన్నుల ఇసుక అవసరాలు ఉంటాయి. బోట్ మెన్స్ సొసైటీలు సంఖ్య పెరిగితే మరిన్ని రీచ్ లు ప్రారంభిస్తాం. ఇసుక పెనాల్టీ కింద 24 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది అని కలెక్టర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version