తిరుపతి తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాలకు నేడు సీఎం చంద్రబాబు పరిహారం ప్రకటిస్తారని టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు. ఘటన పై ఆయన చాలా సీరియస్ అయ్యారని చెప్పారు. టోకెన్ కేంద్రం వద్ద ఉన్న డీఎస్పీ గేట్లు తెరవడంతో భక్తులందరూ తోసుకురావడం వల్లనే ఘటన జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం ఈనెల 19 వరకు ఉంటుందని వెల్లడించారు టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు.
ఈ తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. దాదాపు 40 మందికి పైగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. కొందరూ ట్రీట్ మెంట్ తరువాత కోలుకుంటున్నారు. మరణించిన వారికి తిరుపతి రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబాలకు మృతదేహాలను అప్పగించనున్నట్టు అధికారులు వెల్లడించారు. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు వైకుంఠ ద్వార దర్శనం కి సంబంధించిన టోకెన్లను లక్ష వరకు పొందారు భక్తులు.