తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. వారిలో ఐదుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. నర్సీ పట్నానికి చెందిన బి.నాయుడు బాబు(51), విశాఖకు చెందిన రజిని(47), లావణ్య(40), శాంతి (34), కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల(50), తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక(49), మరణించినట్టు గుర్తించారు. ఈ తొక్కిసలాటలో మరో 40 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. జరిగిన తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా.. అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ప్రకటించారు రేవంత్ రెడ్డి.