నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం..800 మంది విద్యార్థులకు అస్వస్థత !

-

Nujiveedu Triple IT College: నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం రేపింది. ఏకంగా 800 మంది విద్యార్థులకు అస్వస్థత చోటు చేసుకుందని సమాచారం. నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం చోటు చేసుకుందట.. 3 రోజుల్లో 800 మంది విద్యార్థులకు అస్వస్థత నెలకొందని సమాచారం. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారట విద్యార్ధులు.

Confusion in Nujiveedu Triple IT.. 800 students sick in 3 days

హ‌స్ట‌ల్ మెస్‌లో ఆహారం నాణ్య‌త స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్లే ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. అయితే.. దీనిపై రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో గత 3 రోజులుగా విద్యార్థులు పెద్దఎత్తున అనారోగ్యానికి గురయ్యారన్న వార్త నన్ను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను అదేశించానని ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. ఇటువంటివి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అధికారుల పై ఉందన్నారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version