కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుండి పోటీ చేస్తానని గద్దర్ కూతురు వెన్నెల పేర్కొంది. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ..
రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఉద్యమించాలని గద్దరన్న అనుకున్నారు.ప్రజల కోసం కృషి చేశారు. సమసమాజం కోసం కృషి చేశారు.. ఎక్కని గడప లేదు. మొక్కని గుడి లేదు. కాంగ్రెస్ నాన్న నీ దగ్గరికి తీసుకున్నారు.మొదట్లో కాంగ్రెస్ సీట్ ఇస్తాము అన్నారు.
ఇప్పుడు ఇంకా ఏమి మాట్లాడలేదు.ఒకవేళ సీట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ తోనే ఉంటాము. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఇక్కడ ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం వల్లే కదా.. ఆమెకు గద్దరన్న గురించి తెలుసు అన్నారు.
మా నాన్న 2014 నుంచి ఓటు వేస్తున్నాడు. చివరి దశలో మా తండ్రి కాంగ్రెస్ తో ఉన్నారు.యుద్ధం లో నిలబడటం గ్యారెంటీ.
కాంగ్రెస్ సీట్ ఇచ్చినా ఇవ్వకున్నా.. ఎన్నికల్లో పోటీ చెయ్యడం ఖాయం అని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు. గద్దర్ చివరి క్షణాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్టు చేస్తానని చెప్పారు. నాన్న మార్గంలోనే పయణిస్తానని చెప్పుకొచ్చారు గద్దర్ కూతురు వెన్నెల.