CPI నారాయణ..వైన్ షాప్ లో దర్శనమించారు. మద్యం బాటిళ్లతో ఫోజులు ఇచ్చారు. Gst ని వ్యతిరేకిస్తూ… వైన్ షాప్ కు వెళ్లారు. ఇక ఈ సందర్భంగా Gst వివరాలు అడిగి తెలుసుకున్న నారాయణ.. బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు.
మోడీ పాలనకు వ్యతిరేకంగా ఇంటింటికి వెళ్తున్నాం… స్మశాన వాటికలో పని చేసే వారి నోట్లో కూడా మట్టికొడుతున్నాడని ఆగ్రహించారు. శవాల పై కూడా జీఎస్టీ వేస్తు న్నాడని.. 200 స్మశాన వాటికలో 4 వేల మంది కార్మికులు ఉన్నారన్నారు. మోడీ హయం లో స్మశాన వాటికలో పని చేసే వాడికి కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శలు చేశారు. స్మశాన వాటిక కాం ట్రాక్టు కూడా పెద్దోళ్లకు ఇస్తున్నారని… కాంట్రాక్టు వర్కర్స్ ని తెస్తున్నారన్నారు CPI నారాయణ.