ఈ-కామర్స్ రంగం వేగంగా దూసుకెళ్తోంది : మంత్రి కేటీఆర్

-

ఈ-కామర్స్ రంగం వేగంగా దూసుకుపోతోందని.. రానున్న రోజుల్లో ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఉపాధి కల్పనతో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. సంగారెడ్డిలో ఫిప్‌కార్ట్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

తెలంగాణను దేశానికే రోల్‌మోడల్‌గా మారుద్దామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలంగాణ చేస్తోంది.. రేపు యావత్‌ భారతదేశం ఫాలో అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క బృందాలు విజ‌య‌వంతంగా ప‌ని చేస్తున్నాయని తెలిపారు. ఉపాధి క‌ల్ప‌న‌లో మ‌హిళ‌ల‌కు 50 శాతం ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్‌ సూచించారు. రాష్ట్రంలో కేవలం ఫ్లిప్‌కార్ట్‌ ద్వారానే సుమారు 40వేల మందికి ఉపాధి లభిస్తోందని.. ఇది గర్వకారణమని అన్నారు.

ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇది తెలంగాణలోనే అతిపెద్ద ఫెసిలిటీ సెంటర్‌ అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకారం అందించడం ఆనందంగా ఉందని కృష్ణమూర్తి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version