వివేకా హత్య కేసులో సీబీఐ చేతిలో కీలక సాక్ష్యాలు ?

-

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక సాక్ష్యాలు సంపాదించినట్టు తెలుస్తోంది. పులివెందులలోని చెప్పుల దుకాణం యజమాని అయిన మున్నా కుటుంబ సభ్యులను సీబీఐ విచారించినట్టు తెలుస్తోంది. సదరు మున్నాకి సంబంధించిన గ్రామీణ బ్యాంకు లాకర్‌లో నగదు, బంగారం గుర్తించారు సీబీఐ అధికారులు. బ్యాంకు లాకర్‌లో రూ.48 లక్షలు, 25 తులాల బంగారం గుర్తించారు అధికారులు. అలానే సీబీఐ అధికారుల అదుపులో మరో కీలక వ్యక్తి ఉన్నట్టు సమాచారం.

ఎంపీ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు, ఆయన ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఉదయ్ కుమార్ రెడ్డి యురేనీయం కర్మగారంలో ఉద్యోగని అంటున్నారు. ఇప్పటికే పులివేందులకు చెందిన చెప్పుల వ్యాపారి మున్నా బ్యాంక్ ఖాతాలనే సీజ్ చేసిన అధికారులు అతని మీద కూడా ఫోకస్ పెట్టారు. భార్య భర్తల వ్యవహారంలో మున్నాను అప్పట్లో వైఎస్ వివేకా మందలించినట్టు చెబుతున్నారు. ముగ్గురిని వివాహం చేసుకున్న మున్నాని అప్పుడు వివేకా మందలించిన క్రమంలో పాత కక్షల కారణంగా వివేకాను హత్య చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు సాగిస్తోంది సీబీఐ బృందం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version