మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగికి సైబర్ టోకరా!

-

రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మోసగాళ్లు బ్యాంకు ఖాతా నుండి డబ్బులు దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, లేదా ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నెరగాళ్ల నుండి అప్రమత్తంగా ఉండడానికి పోలీసులు ఎంత అవేర్నెస్ చేస్తున్నప్పటికీ, సైబర్ మోసాలను అరికట్టడానికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఈ నేరగాళ్లు కొత్తదారుల్లో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఘటనే విజయవాడలో చోటు చేసుకుంది. ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని వద్ద పార్ట్ టైం ఉద్యోగం పేరుతో 20 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ట్రేడ్ ప్రాజెక్టులు కొనుగోలు చేసి తద్వారా డబ్బులు సంపాదించవచ్చు అంటూ నమ్మబలికారు. ఇది నమ్మిన ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పలు దఫాలుగా 20 లక్షలు పెట్టుబడి పెట్టింది. కానీ వారు డబ్బులు చెల్లించకపోవడంతో సదరు వ్యక్తులను ప్రశ్నించింది బాధితురాలు. అయినప్పటికీ వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version