కౌంటర్ @ 28 డేస్: కేంద్రీకరణ వద్దు – వికేంద్రీకరణ ముద్దు!

-

అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండాలంటూ కొంతమంది రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మొదలైనవారు టీడీపీ సౌజన్యంతో స్టార్ట్ చేసిన ఉద్యమం గురించి తెలిసిందే. ఆ ఉద్యమం తాజాగా 300వ రోజుకు చేరుకున్న సంగతీ తెలిసిందే. అయితే అది అసలు ఉద్యమమే కాదనేది వైకాపా నేతల వాదన! పైగా అది రైతుల ఉద్యమం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఉద్యమం అనే కామెంట్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ కార్యక్రమానికి కౌంటర్ కార్యక్రమం స్టార్ట్ అయ్యి నేటికి 28వ రోజు!

అవును… అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండాలని, మిగిలిన ప్రాంతాల అభివృద్ధితో తమకు సంబంధం లేదని, తాము పెట్టుబడులు పెట్టిన చోటే అభివృద్ధి జరగాలన్నట్లుగా జరుగుతున్న కేంద్రీకరణ ఉద్యమానికి పోటీగా అన్నట్లుగా “కేంద్రీకరణ వద్దు – వికేంద్రీకరణ ముద్దు” (ఒకేచోట వద్దు మూదు చోట్ల అభివృద్ధి ముద్దు) అన్న ఉద్దేశ్యంతో ఒక ఉద్యమం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ ఉద్యమం 28వ రోజుకి చేరుకుంది. ఈ సందర్భంగా మైకులందుకున్న వక్తలు చంద్రబాబుపైనా, ఆయన బినామీలపైనా, ఆర్.ఆర్.ఆర్. పైనా ఫైరయ్యారు!

చంద్రబాబు తన బినామీలైన సుజనాచౌదరి, మాజీ మంత్రులతో పాటు తన సామాజిక వర్గం ప్రయోజనాల కోసమే తాపత్రయ పడుతున్నారు తప్ప.. మిగిలినవారు ఏమైపోయినా తనకు పట్టదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు న్యాయ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని.. కోర్టుల్లో తన వర్గ న్యాయవాదులను జొప్పించి.. పేదలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పేదల ఇళ్ల స్థలాలను అడ్డుకోవడం దుర్మార్గమని విమర్శించారు. ఇదే క్రమంలో రఘురామకృష్ణరాజు డబ్బు మదంతో మహిళలను వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు!

ఏది ఏమైనా… గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్ ‌లో అమరావతి ఉద్యమానికి కౌంటర్ గా మరో ఉద్యమం స్టార్ట్ అయ్యినట్లే. ప్రస్తుతం ఈ ఉద్యమం కూడా రోజు రోజుకీ పీక్స్ కి చేరుతుండటం గమనార్హం!!

Read more RELATED
Recommended to you

Exit mobile version