డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అస్వస్థత

-

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. కొద్ది రోజులుగా జ్వరంతోనే బాధపడుతున్న ఆయన విజయవాడ వరదలపై సమీక్షలు నిర్వహించారు. గురువారం కూడా ఆయన అస్వస్థతతోనే అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఆయనకు ఫీవర్ ఇంకా ఎక్కువ కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

 

ఇక నేడు వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్.. వరద తగ్గిన ప్రాంతాలలో వెంటనే సూపర్ క్లోరినేషన్ చేయడం, పారిశుద్ధ్య పనులను వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఏమాత్రం అలసత్వం వహించినా ప్రజలంతా తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని అధికారులను హెచ్చరించారు. అలాగే ఏలేరు రిజర్వాయర్ వరద పై అధికారులను ఎప్పటికప్పుడు అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని తెలిసిన ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version