అప్పన్న భక్తులకు అదిరిపోయే శుభవార్త..ఇకపై రాత్రి కూడా అన్నప్రసాదం

-

వరాహ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఆలయ నిర్వాహకులు శుభవార్త విశాఖ(D) సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు ఆలయ నిర్వాహకులు శుభవార్త చెప్పారు. ఇకపై రాత్రి సమయాల్లో కూడా భక్తులకు అన్నప్రసాదం అందిస్తామని ప్రకటించారు.

నిన్న రాత్రి భక్తులకు అన్నప్రసాదం అందించగా… నేటి నుంచి పూర్తిస్థాయిలో అన్నదానం అమలు చేయనున్నారు. గతంలో రెండు పూటలా అన్న ప్రసాదం పంపిణీ జరిగేది కాగా… కరోనా సమయంలో రాత్రిపూట అన్న ప్రసాదం పంపిణీని నిలిపివేశారు.

కాగా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అయిన నేడు కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనుంది. అన్ని జీవులకు అన్నం ప్రసాదించే దేవతగా అన్నపూర్ణను కొలుస్తారు. అన్నం లేనిదే జీవుల మనుగడ ఉండదు. అన్నపూర్ణ దేవిని దర్శించుకుంటే అన్నానికి ఎలాంటి లోటు లేకుండా…. ఇతరులకు అన్నదానం చేసే స్థితి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

Read more RELATED
Recommended to you

Exit mobile version