Vijayawada : నేడు అన్నపూర్ణాదేవీగా దర్శనమివ్వనున్నారు విజయవాడ దుర్గమ్మ తల్లి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు అయిన నేడు కనకదుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనుంది. అన్ని జీవులకు అన్నం ప్రసాదించే దేవతగా అన్నపూర్ణను కొలుస్తారు.
అన్నం లేనిదే జీవుల మనుగడ ఉండదు. అన్నపూర్ణ దేవిని దర్శించుకుంటే అన్నానికి ఎలాంటి లోటు లేకుండా…. ఇతరులకు అన్నదానం చేసే స్థితి కలుగుతుందని భక్తుల విశ్వాసం. కాగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో నవరాత్రోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. రెండవరోజు గాయత్రీదేవి గా దర్శనం ఇస్తున్నారు విజయవాడ కనకదుర్గమ్మ. ఇప్పటివరకూ 40 వేలకు పైగా భక్తులు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా క్యూలైన్లలో విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉన్నారు. మొదటిరోజు కంటే తక్కువగా భక్తుల రద్దీ ఉండటం గమనార్హం.