తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 12న దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి పండుగ రోజున ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఆస్థానం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ 4 మాడవీధుల్లో విహరిస్తారు.
ఆస్థానం సందర్భంగా 12న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేశారు. తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు. ఇది ఇలా ఉండగా.. తిరుమల శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజే 7 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. ఈ తరుణంలోనే టోకెన్‌లేని భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 78,389 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు నిన్న ఒక్క రోజే 23,466 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. అలాగే.. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.87 కోట్లుగా నమోదు అయింది.