ఉమ్మడి పౌరస్మృతి (UCC) పై ఇప్పటివరకు ఎలాంటి డ్రాఫ్ట్ తమకు రాలేదని.. అందులో ఏ ఏ అంశాలు ఉన్నాయో ఎవరికీ తెలియదని అన్నారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి. యూసీసీ అంశంపై నేడు ముస్లిం ప్రజా ప్రతినిధులు, మత పెద్దలు సీఎం జగన్ ని కలిశారు. తమ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల ప్రభుత్వమని అన్నారు. యుసిసిపై మీడియాలో పలుచోట్ల విపరీతంగా చర్చ నడుస్తోందని.. దీనిపై ఆలోచనలు చేసి సలహాలు ఇవ్వాలని జగన్ కోరారు.
ఇక యుసిసి బిల్లును వ్యతిరేకిస్తామని జగన్ తమకు చెప్పారని అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. యూసీసీ ద్వారా ముస్లింలలో అభద్రతాభావం ఏర్పడిందని సీఎం కి తెలిపామన్నారు. సీఎంతో మూడు గంటల పాటు భేటీ అయ్యి తమ వినతులను వివరించామని తెలిపారు. యూసీసీ అంశంలో ఎవరు అభద్రతాభావానికి గురికావద్దని, అండగా ఉంటామని సీఎం జగన్ ధైర్యం చెప్పారని వెల్లడించారు.