2024 ఏపీ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో హింసలు చెలరేగిన విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీంతో సిట్ ద్వారా విచారణ చేయించాలని ఆదేశాలు జారీ చేయగా, పల్నాడు, తిరుపతి, నరసరావుపేట, చంద్రగిరి ప్రాంతాలో సిట్ అధికారులు దర్యాప్తు చేశారు. అల్లర్లపై నమోదైన ఎఫ్ఎస్ఐఆర్ లను పరిశీలించిన సిట్.. కొన్ని ఎర్లలో అదనపు సెక్షన్లను చేర్చాలని నిర్ణయించింది.
ఆయా ప్రాంతాల్లో చెలరేగిన అల్లర్లకు సంబంధించిన నిందితుల వివరాలను సిట్ సేకరించింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల వేళ అల్లర్లు చెలరేగిన జిల్లాల్లోని ముగ్గురు ఎస్సీలపై ఈసీ శాఖాపరమైన చర్యలు తీసుకుంది. ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకుండా.. హింసకు బాధ్యులైన పల్నాడు, అనంతపురం ఎస్సీల పై సస్పెన్షన్ విధించగా.. తిరుపతి ఎస్సీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. అలాగే ఈసీ మోపిన అభియోగాలపై 15 రోజుల్లో లిఖిత పూర్వకంగా కానీ, విచారణ అధికారి ఎదుట గాని నేరుగా వాదనలు వినిపించాలని.. సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. లేదంటే బాధ్యులపై తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎస్ వార్నింగ్ ఇచ్చారు.