ఇవాళ అసెంబ్లీకి రానున్న కేసీఆర్…!

-

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారు అయింది. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఇవాళ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ నెల 19వ తేదీన బడ్జెట్‌ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Boss KCR to attend assembly sessions from now on

అయితే… నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలోనే కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తారని ప్రచారం జరుగుతోంది. మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పట్టు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలని, తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే.. తాను కూడా అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్లు తెలిపారట.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version