ప్రతినెలా రెండవ శనివారం స్వచ్చాంధ్రప్రదేశ్ – ఏపీ సర్కార్

-

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికీ ఆరు నెలలు పూర్తయింది. దీంతో రాష్ట్రంలో పాలనను మరింత పరుగులు పెట్టించడానికి సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈనెల 11, 12 తేదీల్లో కలెక్టర్ల సదస్సు జరుపుతున్నారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్ లో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.

నేడు రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కలెక్టర్లతో చంద్రబాబు వివిధ అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీలు ప్రధానంగా మహిళలపై అత్యాచారాలు, దాడులు వంటివి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మూడు నెలల్లోపల పోలియో, అంగవైకల్యం అంశాలపై ఒక రిపోర్ట్ సిద్ధం చేయాలని సూచించారు.

అలాగే గోదావరి పుష్కరాలకు కావలసిన ప్లానింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. రాబోయే మూడు నెలల్లో పరిశీలించి పెన్షన్లు ఎన్ని అనేది తేల్చాలన్నారు. పెన్షన్లు అదనంగా 6 లక్షలు ఉన్నట్లు గుర్తించింది ప్రభుత్వం. ఇక సున్నిపెంటను ఓ టౌన్ షిప్ గా శ్రీశైలం దేవాలయం ఆధ్వర్యంలో అభివృద్ధి చేయాలని సూచించారు. శ్రీశైలం ని ఆధ్యాత్మిక అభివృద్ధికి టూరిజం, ఫారెస్ట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లు కలిసి ప్రణాళిక వేయాలన్నారు. ఇక ప్రతి నెల రెండవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కి కేటాయిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version