సినిమాను తలపించే క్రైమ్ స్టోరీ.. కువైట్ నుంచి వచ్చి మరీ చంపేశాడు!

-

సినిమా కథను తలపించే ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కువైట్ నుంచి వచ్చి మరీ హత్య చేసి చడీచప్పుడు కాకుండా తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తను హత్య చేసిన విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించి, ఈ హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించడంతో అందరూ నిర్ఘాంతపోయారు. దీంతో ఈ విషయం సంచలనం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్త మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమే భర్త ఆంజనేయ ప్రసాద్ కువైట్ లో ఉంటున్నారు. వీరి కుమార్తె (12) ను గ్రామంలో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరస అయ్యే బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది.

దీంతో ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగగా.. ఆమె సరిగా స్పందించలేదు. దీంతో ఆందోళనతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించి వదిలేశారు. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్ కి చెప్పింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన అతడు తన కూతురిపై అసబ్యంగా ప్రవర్తించినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు.

అనంతరం కువైట్ నుంచి వచ్చి శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్ తో మోదీ హత్య చేసి వెంటనే కువైట్ కి వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయం తెలియక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత ఈ విషయాన్ని వివరిస్తూ బుధవారం సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు ఆంజనేయ ప్రసాద్. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని పేర్కొన్నాడు. చట్ట ప్రకారం న్యాయం జరగాక పోవడంతో హత్య చేశానని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version