కాకినాడ లో దారుణం చోటు చేసుకుంది. తాజాగా కాకినాడలో పేలుడు కలకలం రేగింది. కాకినాడ బాలాజీ ఎక్సపర్టర్స్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇక ఈ పేలుడులో నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి. హమాలీలు లోడ్ దింపుతుండగా సంభవించింది పేలుడు. భారీ శబ్దం రావడంతో పరుగులు తీశారు హమాలీలు.

హైదరాబాద్ నుంచి చిన్న క్రాకర్స్ పార్శిల్ వచ్చాయి, ఆ మూటను ఒక్కసారిగా కింద పడేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని కాకినాడ జీ జీ హెచ్ కి తరలించారు స్థానికులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడలో పేలుడు కలకలం.
బాలాజీ ఎక్స్‌పోర్ట్స్ లో ఒక్కసారిగా పేలుడు.
హమాలీలు పార్సిల్ అన్లోడ్ చేస్తుండగా ఘటన.
గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్‌కు తరలింపు. pic.twitter.com/x0pv81s3c5
— greatandhra (@greatandhranews) March 3, 2025