విజయనగరం ఉగ్ర పేలుళ్ల కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ వారం విజయనగరంలోనే 4 ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేశారు. స్లమ్ ఏరియాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. దిలసుఖ్ నగర్, కోఠిలోని గోకూల్ చాట్ పేలుళ్ల మాదిరి ప్లాన్ చేసినట్లు సమాచారం.

విజయనగరం నుంచి విశాఖ వెళ్లిపోయిన NIA అధికారులు.. సిరాజ్, సమీర్ లను రేపు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. సిరాజ్ తండ్రి, సోదరుడిని విజయనగరం టూటౌన్ PS లో విచారిస్తున్నారు పోలీసులు.
కాగా తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదుల అరెస్ట్ కలకలం రేపింది. హైదరాబాద్ లో డమ్మీ బాంబ్ బ్లాస్ట్ కు ప్లాన్ చేసి అరెస్ట్ అయిన సమీర్, సిరాజ్ ఏ ఉగ్రసంస్థతో టచ్ లో ఉన్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ISIS డైరక్షన్ లో పని చేస్తున్నట్లు ప్రాథమిక గుర్తించారు. ఇప్పటికే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది NIA.