రైతులకు బిగ్ షాక్..ఏపీలో రైతుల విపత్తు నిధులు గల్లంతు… !

-

ఏపీ రైతులకు షాక్‌ తగిలింది. విపత్తులు సంభవించినప్పుడు నష్ట పోయిన రైతులకు ఇవ్వాల్సిన రూ. 1000 కోట్లను సీఎం జగన్‌ మళ్లించినట్లుగా కేంద్రం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఇన్‌ పుట్‌ సబ్సిడీ పేరుతో పంపిణీ చేశారని.. వాస్తవంగా రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వలేదని.. కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్‌ చౌదరి ప్రకటించారు.

ఏపీ సర్కార్‌ కేంద్ర నిధులు మళ్లించిందో లేదో చెప్పాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. ఇందులో చాలా నిధులు మళ్లించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు.

ఏపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తు నిధికి…304 కోట్లు, జాతీయ విపత్తు కింద 570 కోట్లు ఇచ్చింది. అయితే ఈ నిధులన్నీ మరణించినట్లుగా కేంద్ర మంత్రి తెలిపారు. ఏకంగా 11 వందల కోట్ల విపత్తు నిధులను ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఖాతాకు మళ్ళించారు. ఖరీఫ్ లో నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు ఆ నిధులు మళ్లించారని కేంద్ర మంత్రి తన సమాధానంలో వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version