పోలవరం పై బడ్జెట్ సమావేశాలలో కీలక ప్రకటన చేశారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. 2027 నాటికి పోలవరం పూర్తి అవుతుందని ఆయన ప్రకటించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పనులు దాదాపు 73 శాతం పూర్తి అయ్యాయని… మిగతా పనులు 2027 నాటికి కంప్లీట్ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పయ్యావుల కేశవ్ మాట్లాడారు.

గత పాలకుల వల్ల పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని ఆగ్రహించారు. ఏటా దాదాపు 2000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నీళ్లను రాయలసీమకు మళ్ళి ఇస్తామని కూడా తెలపడం… జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా పోలవరం బనకచర్ల అనుబంధ ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు.