BREAKING: ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

-

First danger alert issued at Dhavaleswaram: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. గోదావరికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 10.12 లక్షల క్యూసెక్కులు చేరుకున్నట్లు పేర్కొంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.

First danger alert issued at Dhavaleswaram

విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నట్లు వెల్లడించింది. సహాయక చర్యల్లో 5SDRF, 4NDRF బృందాలు పాల్గొంటాయని తెలిపింది.
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

మరోవైపు ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈరోజు ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 46.50 అడుగులు దాటి ప్రవహిస్తోంది. ఆదివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version