రెడ్ బుక్ నా వరకు వచ్చింది అంటూ ఆసక్తి కర కామెంట్స్ చేశారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు. మీడియా తో మాట్లాడుతూ ఉండగానే కొమ్మినేని ని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ…. రెడ్ బుక్ నా వరకు వచ్చింది.

జర్నలిస్టులపై కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఫైర్ అయ్యారు. 70 ఏళ్ల వయస్సులో నన్ను వేధిస్తున్నారని ఆగ్రహించారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు.
కాగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తరుణంలోనే హైదరాబాద్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విజయవాడకు తరలించారు. టీవీ డిబేట్లో అమరావతి మహిళలను కించపరిచారనే అభియోగాలతో నమోదైన కేసుల్లో . సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.