Jagan: హిమాలయాలకు మాజీ సీఎం జగన్​ !

-

వైసీపీ పార్టీ ఓటమి పై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారట. మాజీ సీఎం జగన్ ఎన్నికల ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లాలనుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పార్టీ నేతలతో చెప్పినట్టు సమాచారం. కానీ 40% ఓట్లు చూసి ఆగిపోయానని వారితో చెప్పారని టాక్ నడుస్తోంది. ‘ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్‌ నుంచి బయటపడడానికి నాకు 3 రోజులు పట్టింది. పెద్ద సంఖ్యలో జనాలు మన వెంటే ఉన్నారు.

When YS Jagan Wanted To Quit Politics And Go To Himalayas

వారి కోసమైనా నిలబడాలి అనుకున్నా’ అని మాజీ సీఎం జగన్ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. కాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో… వైసీపీ పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో… కేవలం 11 స్థానాలకే పరిమితమైంది వైసిపి పార్టీ. అటు నాలుగు ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుచుకుంటానని…మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పేవారు. కానీ ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version