లడ్డులో జంతువుల కొవ్వు వాడకపోతే..చంద్రబాబు కాళ్లు, చేతులు, నోరు పడిపోతాయి -నారాయణ స్వామి

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వాడకపోతే..చంద్రబాబు కాళ్లు, చేతులు, నోరు పడిపోతాయంటూ మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు వాడిన వారిని వెంకటేశ్వర స్వామి శిక్షిస్తారని హెచ్చరించారు. నేను చేసింది తప్పని చంద్రబాబు ఒప్పుకోవాలన్నారు. ప్రజల మద్దతుతో గెలిచి ఉంటే… స్వామీ వారి లడ్డు పై చంద్రబాబు అలా మాట్లాడి ఉండడని పేర్కొన్నారు.

Former Deputy CM of Andhra Pradesh State Narayana Swamy made sensational comments

ఈవీఎం ద్వారా గెలిచాడు కాబట్టే ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు. మనిషిగా పుట్టిన వాడు ఎవడు ఇలా మాట్లాడడన్నారు. వయసు ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడని ఆగ్రహించారు. జగన్ పై బురద చల్లడమైన లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నాడు… స్వామివారి లడ్డు గురించి తప్పుగా ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడని నిప్పులు చెరిగారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామి.

Read more RELATED
Recommended to you

Exit mobile version