జగన్‌ కుటుంబంలో మేం ఎందుకు చిచ్చులు పెడతాం – గంటా శ్రీనివాసరావు

-

జగన్‌ కుటుంబంలో మేం ఎందుకు చిచ్చులు పెడతామని సీఎం జగన్‌ పై గంటా శ్రీనివాసరావు ఫైర్‌ అయ్యారు. X(ట్విట్టర్) వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. మీరు జైళ్లో ఉన్నా సమయంలో మీ విజయానికి అహర్నిశలు శ్రమించిన మీ తల్లి, చెల్లి కష్టాన్ని వాడుకుని సీఎం అయ్యాక వారిని బయటకి తరిమేసిన మాట నిజం కాదా…..? మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ ఈరోజు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు…? అంటూ నిలదీశారు.

Former minister Ganta Srinivasa Rao slams cm jagan mohan

ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణాన్ని అని మీకోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లికి అన్యాయం చెయ్యమని ఏ పార్టీ చెప్పింది.. ఏ నాయకుడు చెప్పాడు…మీ చెల్లి కి ఆస్థి పంపకాల్లో అన్యాయం చెయ్యమని, ఎంపీ టికెట్ ఇవ్వొద్దని ఏ పార్టీ చెప్పింది… ఏ నాయకుడు చెప్పాడని ప్రశ్నించారు. ఢిల్లీలో తన తండ్రి హత్య కేసు నిందితుల్ని శిక్షించాలని కాళ్ళు అరిగేలా తిరుగుతున్న మరొక చెల్లికి న్యాయం చెయ్యొదని ఏ పార్టీ చెప్పింది…ఏ నాయకుడు చెప్పాడు…..తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని గౌరవించలేనివాడు.. సమాజాన్ని కూడా గౌరవించలేడనే విషయం మరోసారి మీ ద్వారా నిరూపితం అయ్యిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version