టీడీపీ నేతలపై మాజీమంత్రి కొడాలి నాని సెటైర్లు

-

టిడిపి నేతలపై మాజీమంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. తాజాగా మీడియాతో మాట్లాడారు కొడాలి నాని. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ పాట ఎవరో వస్తారనుకుంటే నువ్వోచ్చావా…. అన్నట్లుంది యార్లగడ్డ వ్యవహారం అన్నారు. 2024 ఎన్నికల్లో ఓటమినీ ముందే గ్రహించిన చంద్రబాబు….. ఓట్ల తొలగింపును కారణంగా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు అని పేర్కొన్నారు.

గన్నవరంలో లోకేష్ పాదయాత్ర చేస్తే గుడివాడలో ట్రాఫిక్ జామ్ అయింది. జగన్మోహన్ రెడ్డి పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బాల్ బచ్చా లోకేష్…. సీఎం జగన్  గురించి మాట్లాడటమా..? 64 పంచాయతీలో ఎన్నికలు జరిగితే పది చోట్ల గెలిచింది టిడిపి. 175 స్థానాల్లో జరిగే ఎన్నికల్లో 22 చోట్ల గెలుస్తుందేమో అని జోస్యం చెప్పారు కొడాలి నాని. అంతకు ముందు గుడివాడలో చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని విమర్శిస్తే రాజకీయంగా ఏం జరుగుతుందో తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. చిరంజీవిని తాను ఎప్పుడూ విమర్శించలేదని క్లారిటీ ఇచ్చారు కొడాలి నాని. 

Read more RELATED
Recommended to you

Exit mobile version