చంద్రబాబు ఫొటోను బండకేసి కొట్టిన మాజీ ఎంపీ రాయపాటి కుమారుడు !

-

చంద్రబాబుకు ఉహిచని షాక్ ఇచ్చారు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు. కోపంతో చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టారు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు. టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా కోపంతో తన ఆఫీసులో ఉన్న చంద్రబాబు ఫొటోను నేలకేసి కొట్టి ‘లోకేశ్ మంగళగిరిలో ఎలా గెలుస్తాడో చూస్తా’ అంటూ సవాలు విసిరారు రాయపాటి రంగారావు.

Former MP Rayapati’s son who threw a rock at Chandrababu’s photo

ఎన్నికల్లో ఆయన సత్తెనపల్లి సీటు ఆశించగా టీడీపీ కన్నా లక్ష్మీనారాయణను అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించింది. కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న రంగారావు తాజాగా టీడీపీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన తన రాజీనామా లేఖను టీడీపి అధినేత చంద్రబాబుకు పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీలో ఇమడలేనని… తన రాజీమానా లేఖను ఆమెదించాలని లేఖలో పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులు.. ఆఫీసులో ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటోను నేలకేసి పగలగొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట్ల వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version