పులివెందుల బై పోల్.. మీసం మెలేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

-

వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీసం మెలేసారు. పులివెందుల, ఒంటిమిట్టలో పోలింగ్ ముగిసింది. క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ కల్పిస్తున్నారు. పులివెందుల మండలంలోని రెండు గ్రామాల్లో గొడవలు జరిగాయి. ఒంటిమిట్ట మండలంలోని చిన్నకొత్తపల్లి, మంటపంపల్లిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కేసులు నమోదు అయ్యే స్థాయిలో గొడవలు జరగలేదన్నారు కడప డీఐజీ.

Former YSRCP MLA Rachamallu Sivaprasad Reddy has shaved his mustache
Former YSRCP MLA Rachamallu Sivaprasad Reddy has shaved his mustache

ఇక దీనిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడారు. నాలుగేళ్ల తర్వాత టీడీపీ అభ్యర్థులను కనీసం వార్డు మెంబర్లుగా కూడా గెలవనివ్వబోమన్నారు. పోలీసులకు నాలుగేళ్ల తర్వాత ఈ ఉద్యోగాలు ఉండవు అని వెల్లడించారు. ఈ రోజు దౌర్జన్యం చేసిన ఇదే పోలీసులు రేపు ఖాకీ బట్టలు వేసుకుని పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేసుకుంటారన్నారు వై సీ పీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news