రానున్న 3 రోజులు సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ఇంఛార్జ్ మంత్రులు, అధికారులకు సూచించిన సీఎం రేవంత్… రానున్న మూడు రోజులు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్ తో పాటు వరద ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.