ఏపీలోని క్యాన్సర్ బాధితులకు శుభవార్త. శ్రీ వేంకటేశ్వర ఇన్సిటిట్యూట్ ఆవరణలో శ్రీ బాలాజీ ఆంకాలజీ భవనానికి శంకుస్థాపన చేశారు టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. సీఎం జగన్ ఆదేశాలతో మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం చేపట్టారు. 124 కోట్ల రూపాయలు శ్రీ బాలాజీ ఇన్సిట్యుట్ ఆఫ్ క్యాన్సర్ ఆంకాలజి హాస్పిటల్ నిర్మాణం చేపట్టినట్లు టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఈ రోజు కీలకమైన బంకర్ బ్లాక్ శంకుస్థాపన చేశామని.. 200 కోట్ల రూపాయలతో అత్యధునిక యంత్రాలు , సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి. క్యాన్సర్ రాకుండా తీసుకొవాలి ల్సిన జాగ్రతలు, టెస్ట్ లు పింక్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని.. ప్రతి జిల్లా కు పింక్ బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు వెల్లడించారు. చిత్తూరు , తిరుపతి జిల్లా నలుమూలల పింక్ బస్సులు పంపించి ,స్క్రీనింగ్ చేస్తున్నాం… మూడు లక్షల ఏస్.ఎఫ్. టి లతో ఈ హాస్పిటల్ నిర్మాణం అన్నారు. మొత్తం 400 బెడ్స్ కెపాసిటీ తో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి.