నవంబర్ లో గగన్ యాన్ -జి 1 ప్రయోగం – ఇస్రో ప్రకటన

-

ఈ ఏడాది నవంబర్ లో గగన్ యాన్ – జి 1 ప్రయోగం ఉంటుందని ప్రకటించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. SSLV D-3 రాకెట్‌ ప్రయోగం విజయవంతం అయింది.. ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది SSLV D-3. ఈ సందర్భంగా శ్రీహరి కోటలో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ విజయం శాస్త్రవేత్తల సమిష్టి విజయం అన్నారు. S.S.L.V. సిరీస్ లో ఈ ప్రయోగం మూడోదని చెప్పారు.

Gagan An-G1 launch in November

500 కిలోమీటర్ల ఎత్తులో. 500 కేజీల బరువు కలిగిన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఈ రాకెట్ ను రూపొందించారని తెలిపారు. ఇస్రో ప్రయోగించే నానో, మైక్రో శాటిలైట్లను తక్కువ ఖర్చుతో ప్రయోగించేందుకు ఎస్ ఎస్ ఎల్ వి ఉపయోగపడుతుందన్నారు. ఈ రోజు ప్రయోగించిన ఉపగ్రహం మూడు రోజుల్లో ఛాయా చిత్రాలను పంపుతుందని పేర్కొన్నారు. ఇస్రో తో పాటు పలు కంపెనీల సహకారంతో తక్కువ కాలంలో ఎస్ఎస్ఎల్వి-డి 3 రాకెట్ కు రూపకల్పన చేసామన్నారు. వచ్చే నెలలో పి.ఎస్.ఎల్ వి… అనంతరం దేశీయ నావిగేషన్ కోసం ప్రయోగాలు చేస్తామని ప్రకటించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version