రేపల్లెలోని రొయ్యల యూనిట్ లో గ్యాస్ లీకేజీ…60 మంది కార్మికులు !

-

బాపట్ల జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో గ్యాస్ లీకేజీ సంఘటన చోటు చేసుకుంది. దీంతో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో పనిచేస్తున్న 60 మంది కార్మికులు..అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే స్పందించింది రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ యాజమాన్యం.

Gas leakage at a shrimp processing unit in Nizampatnam, Repalle constituency

అనంతరం భాదితులను నిజాంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించింది రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ యాజమాన్యం. ఇందులో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇక రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ లో గ్యాస్ లీకేజీ సంఘటన గురించి తెలుసుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్‌.. స్పందించారు. భాదితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫోన్ లో ఆదేశించారు మంత్రి అనగాని సత్యప్రసాద్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version