యురేనియంపై తవ్వకాలపై వెనక్కి తగ్గిన చంద్రబాబు సర్కార్‌ !

-

కర్నూలు జిల్లాకు చెందిన యురేనియంపై తవ్వకాలపై చంద్రబాబు సర్కార్‌ వెనక్కి తగ్గింది. ఈ మేరకు కర్నూలు జిల్లాకు చెందిన ఆర్డీఓ భరత్ నాయక్ కీలక కామెంట్స్ చేశారు. ప్రజలకు తెలియకుండా యురేనియం పై నిర్ణయం తీసుకోరని తెలిపారు. గ్రామసభలు నిర్వహించి ప్రజలతో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 4వ తేదీ కలెక్టర్, ఇతర శాఖల అధికారులు వచ్చి ప్రజలతో చర్చిస్తారన్నారు.

Chandrababu Sarkar backed down on uranium mining

దీంతో కర్నూలు…కప్పట్రాళ్ల వద్ద తాత్కాలికంగా ఆందోళన విరమణ చేశారు ఆందోళన కారులు. 4వ తేదీ కలెక్టర్ వచ్చి ప్రజలతో చర్చిస్తారన్న హామీతో ఆందోళన విరమించారు. కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వేలాది మంది పత్తికొండ-కర్నూలు రహదారిపై బైటాయించారు. 3 గంటలుగా ఆందోళన చేయడంతో 2 కి.మీ పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. అయితే.. ఇది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారని టీడీపీ పార్టీ నేతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version