తెలంగాణ, ఏపీలో “శిశుపాల”, “రావణాసుర” వధ జరిగింది – గోనె ప్రకాశ్‌

-

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించడంపై…గోనె ప్రకాశ రావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన అసాధ్యమన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేయడం రాజకీయాల్లో ఓనమాలు తెలియవని భావన కలుగుతోందని జగన్‌ ఉద్దేశించి.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు నవ్వుకుంటున్నారని చురకలు అంటించారు. రాజశేఖర్ రెడ్డి నాకు భగవంతుడు తో సమానమన్నారు.

gone prakash

దయచేసి, ఇలాంటి డిమాండ్లు చేసి నవ్వులుపాలు కావద్దని… ఉభయ తెలుగు రాష్ట్రాల్లో “శిశుపాల”, “రావణాసుర” వధ జరిగిందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు…..ఆ సందర్భంగా, ఒక మాజీ ఎమ్.ఎల్.ఏ గా, మర్యాదపూర్వకంగా సిఎమ్ చంద్రబాబు ను కలిశానన్నారు. ఏమీ అశించి కలవలేదు….ఏలాంటి రాజకీయ పదవులు తీసుకునేది లేదని వివరించారు. నేను సి.ఆర్ ఫౌండేషన్ వారి “వృద్దాశ్రమం” (ఓల్డ్ ఏజ్ హోమ్) లో ఉంటున్నానని వెల్లడించారు. నేను చనిపోయేంతవరకు వృద్దాశ్రమంలోనే ఉంటాను… నేను ఒక రాజకీయ విశ్లేషకుడి ని మాత్రమే అంటూ పేర్కొన్నారు గోనె ప్రకాశ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version