సింహాలు రౌండప్ చేసినా ధైర్యంగా పోరాడిన చిరుత.. వీడియో వైరల్

-

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు మనల్ని కొన్ని వీడియోలు ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని ప్రేరణ కలిగిస్తాయి. అలాంటి తాజా వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వైల్డ్ లైఫ్కు సంబంధించిన వీడియోస్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఇక తాజా వీడియోలో ఒక చిరుతను దాదాపుగా ఓ పది సింహాలు చుట్టుముట్టాయి. అన్ని వైపుల నుంచి ఆ చిరుతపై దాడికి తెగబడ్డాయి. అయితే అడవికి రారాజు అయిన మృగరాజు తన టీమ్తో వచ్చి దాడి చేస్తున్నా.. చిరుత మాత్రం ఏ కొంచెం కూడా జంకకుండా వాటితో ఫైట్ చేసింది.

ఒక్కో వైపు నుంచి దాడికి తెగబడినా.. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు.. కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తానని ఓ హీరో చెప్పినట్టు.. ఈ చిరుత కూడా కన్ఫ్యూజన్లో తనపైకి దాడికొస్తున్న సింహాలను ఎక్కడికక్కడ నిలువరించింది. అన్ని కలిసి తనపై అటాక్ చేస్తున్నా.. వాటికి లొంగకుండా తన ప్రాణం కోసం పోరాడింది. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ కావడంతో చిరుతకు ఉన్న తెగువను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అన్ని సింహాలు వచ్చి దాడి చేసినా పారిపోకుండా.. అక్కడే నిల్చొని చీతా ఫైట్ చేయడం చూసి చాలా ఇన్స్పైరింగ్గా ఉందని అంటున్నారు. అయితే ఈ వీడియో చివరలో చిరుత కాస్త చలనం లేకుండా పడివడం చూసి ఇంతకూ అది బతికిందా చనిపోయిందా అని ఆందోళన చెందుతున్నారు. ఇక కొందరేమో వైల్డ్ లైఫ్లో ఇంతే గురూ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version