ఏపీ పామాయిల్‌ రైతులకు శుభవార్త..ఇక పై రూ.19,000 !

-

ఏపీ పామాయిల్‌ రైతులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు శుభవార్తను అందించారు. రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశాడు. పామాయిల్ రైతులు, ఆయిల్ ఫెడ్, కంపెనీల యాజమాన్యాలు, ఉద్యానవన అధికారులతో సమావేశం నిర్వహించారు అచ్చెన్నాయుడు.

ఏపీ పామాయిల్‌ రైతులకు శుభవార్త..ఇక పై రూ.19,000 !

ప్రధానంగా ఆయిల్ పామ్ ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామని చెప్పాడు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం పామాయిల్ రైతులకు కాస్త ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతితక్కువ సమయంలోనే టన్ను ధర రూ. 12,500 నుంచి ఏకంగా రూ. 19,000కి ధర పెరిగిందని చెబుతున్నారు. దీంతో పామాయిల్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version