ఏపీలో బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త

-

రేపు దేశ వ్యాప్తంగా వినాయక చవిత పండుగ జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఏపీలో బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త అందింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 31న రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు. నేగోషియాబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం బ్యాంకులకు సెలవు ఇచ్చారు.

ఈ మేరకు సిఎస్ సమీర్ శర్మ ఈ గెజిట్ జారీ చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించాలని బ్యాంకు ఉద్యోగులకు సంబంధించిన వివిధ సంఘాలు పదేపదే విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వినాయక చవితికి 31 నా సెలవు ప్రకటించాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ఆగస్టు 4నే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి కానీ పండుగ దగ్గర పడిన ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. దీంతో బ్యాంకు ఉద్యోగులు సెలవు పై గందరగోళం నెలకొంది అలాగే విమర్శలు రావడంతో ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తానికి బ్యాంకులకు బుధవారం సెలవు దినం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version