ఉపాధి హామీ కూలీలకు శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్. ఇక నేరుగా అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల జీతాలు ఇకపై వారి ఆధార్ తో లింక్ అయిన బ్యాంకు ఖాతాల్లోనే పడతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థకు మారడానికి రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన అవకాశం డిసెంబర్ 31తో ముగిసింది. సమస్యలు ఉన్నచోట మాత్రమే కేంద్రం మినహాయింపు ఇచ్చింది. కాగా దేశంలో 25.89 కోట్ల మంది కూలీలు ఉండగా… ఆధార్ సీడింగ్ పూర్తయిన వారు 13.48 కోట్ల మందే ఉన్నారు.