విద్యార్థులకు శుభవార్త. త్వరలోనే జగనన్న విద్య దీవెన పథకం డబ్బులు విద్యార్థుల ఖాతా లో పడనున్నాయి. ఈ నెల 28న చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు జగన్ వెళ్తున్నారు. కంప్యూటర్ బటన్ నొక్కి ఆ డబ్బులని విడుదల చేయనున్నారు. పేద విద్యార్ధులకు చదువు కోసం అయ్యే ఖర్చును గవర్నమెంట్ ఏ ఇస్తోంది. ఉన్నత విద్య అభ్యసించే వారికి ఆర్ధిక సాయం చేస్తూ ప్రభుత్వమే అండగా నిలుస్తోంది. విద్యా దీవెన కింద డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.
ఏడాదిలో జగనన్న వసతి దీవెన కూడా ఇస్తోంది. విద్యా దీవెన స్కీము పేరుతో పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుకోగలుగుతున్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి చదువులు చదువుకుంటున్నారు. పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా కూడా స్కీమ్ ని తెచ్చింది ప్రభుత్వం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్య దీవెన డబ్బులు పడతాయి. ప్రభుత్వం జమ చేస్తుంది.